loader

ఏపీలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్ మెంట్

కేంద్రం రక్షణశాఖ పరిధిలో చేపడుతున్న ఆర్మీ అగ్నివీరుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని గుంటూరులోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అభ్యర్థుల కోసం నమోదును ప్రారంభించింది అగ్నివీర్ పథకం కింద ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్  ” https://www.joinindianarmy.nic.in”  ద్వారా నమోదు చేసుకోవచ్చు మొట్టమొదటిసారిగా తెలుగుతో సహా 13 వేర్వేరు భాషల్లో ఈ ఆన్ లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతోంది. దరఖాస్తుల నమోదుకు ఏప్రిల్ 10ని […]

వండర్ జెల్: దీంతో 4 గంటల్లో గాయాలు నయం!

ఇదొక సైన్స్ అద్భుతం! పరిశోధకులు ఒక జెల్ కనిపెట్టారు. గాయంపై రాస్తే నాలుగు గంటల్లో 90% నయమవుతుంది. ఈ మందుతో గాయమైన చోట కొత్త పొర ఏర్పడుతుంది. ఆల్టో, బీరూట్ యూనివర్సిటీల వాళ్లు కలిసి ‘సెల్ఫ్ హీలింగ్ హైడ్రో జెల్’ కనిపెట్టారు. నానో షీట్ ద్వారా ఈ పరిష్కారం కనుగొన్నామని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ గురించి మార్చి 7న నేచర్ మెటీరియల్స్ పత్రికలో రాశారు.

జనసేన 12వ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్దం

జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అక్కడి ఏర్పాట్లను మంత్రులు, పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో నిర్వహించే జయకేతనం సభకు గత కొద్దిరోజుల ముందు నుంచే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ జనసేన నేతలు, సైనికులు, మంత్రులు. ఈసభకు ఈసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో భారీ సభాప్రాంగణాన్ని సిద్దం చేశారు

హర్యానా మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా

హర్యానా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురైంది. మొత్తం 10 మేయర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగగా, తొమ్మిదింటిలో బీజేపీ విజయం సాధించింది. మరో స్థానాన్ని ఇండిపెండెంట్‌ అభ్యర్థి కైవశం చేసుకున్నారు. కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవ లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం పొందడంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చూపాలనుకున్న కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి నిరాశ ఎదురైంది.

ఉత్తరాదిలో సీట్లు పెంచుకునే వ్యూహం

హిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్‌ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గెలుపొంది తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. తమిళనాడు విద్యా ప్రగతిని పూర్తిగా నాశనం చేసే ఎన్‌ఈపీని తాము వ్యతిరేకిస్తామని అన్నారు.

హెచ్ఎండీఏ పరిధిలోకి 11 జిల్లాలు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. HMDA పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. 11 జిల్లాలకు చెందిన 104 మండలాలు, 1355 గ్రామాలు ఇకపై హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీగా పిలుస్తారు. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే ఇప్పుడు అది పదివేల కిలోమీటర్లకు చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON