loader

ప్రపంచంలో అత్యంత 20 కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే

పంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నాయని, స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ ఐక్యూఎయిర్ ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 20 కాలుష్య నగరాల్లో 13 భారత్ నుంచి ఉన్నాయి. బైర్నిహాట్ (అసోం), ఢిల్లీ, ములాన్‌పూర్ (పంజాబ్), ఫరీదాబాద్, లోని, న్యూఢిల్లీ, గురుగ్రామ్, గంగానగర్, గ్రేటర్ నొయిడా, భివాండి, ముఫర్‌నగర్, హనుమాన్‌గఢ్, నొయిడా‌ నగరాల్లో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది.

ఆదివాసీ పల్లెకు రాష్ట్ర గవర్నర్..

గత ఏడాది ఆగస్టు మాసంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ములుగు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్దికి నోచుకోని గ్రామాలను దత్తత తీసుకొని దశ మారేలా చేయాలని మంత్రి సీతక్క కోరారు. ఈ నేపథ్యంలో తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని ఇప్పటికే అనేక విధాలుగా రూపు దిద్దుతున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు జిల్లా అధికారులు.

ఎక్స్ పై భారీ సైబర్ దాడి : ఎలాన్ మస్క్ ఆరోపణ

సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగిందని దాని యజమాని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ దాడి చేయడానికి చాలా వనరులు ఉపయోగించారని, దీన్ని ఏదైనా పెద్ద సమూహం లేదా దేశమే చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ సైబర్ దాడి వల్ల ప్లాట్‌ఫామ్ అంతటా అంతరాయం ఏర్పడింది, వేల మంది యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేకపోయారు.

ఏప్రిల్ 2 నుంచి జెఇఇ మెయిన్ సెషన్ 2 పరీక్షలు

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ రెండో విడత పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) విడుదల చేసింది. ఏప్రిల్ 2,3,4,7,8 తేదీలలో పేపర్ 1 పరీక్షలు, ఏప్రిల్ 9న పేపర్ 2ఎ, 2బి పరీక్షలు జరుగనున్నట్లు వెల్లడించింది. జెఇఇ మెయిన్ పరీక్షలను ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్ష పూర్తి చేసి ఫలితాలను వెల్లడించగా, తాజాగా రెండో సెషన్ పరీక్ష నిర్వహణకు ఎన్‌టిఎ ఏర్పాట్లు చేస్తోంది.

సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే రోజుపై క్లారిటీ

అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే రోజుపై క్లారిటీ వచ్చేసింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్‌ స్పేస్‌షిప్‌లో వారు అంతరిక్షం నుంచి భూమికి తిరిగిరానున్నట్లు నాసా అధికారులు తేల్చి చెప్పారు. 2025 మార్చి 16వ తేదీన సునీత, విల్‌మోర్ ఇద్దరూ తిరిగి భూమిపైకి వస్తారని తాజాగా నాసా అధికారులు వెల్లడించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ 10 రోజుల మిషన్‎లో భాగంగా గతేడాది జూన్‎ 5వ తేదీన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON