loader

లండన్‌లో.. భారత విదేశాంగ మంత్రిపై దాడికి యత్నం..

భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటనలో ఉన్నారు. ఇరుదేశాల మధ్య అనేక అంశాలలో చర్చలు జరుపుతున్నారు లండర్ లో తాజాగా.. జైశంకర్ ఛారమ్ హౌస్ లో తన సమావేశంను ముగించుకుని బైటకు వస్తున్నారు.ఇంతలో కొంత మంది ఖలీస్థానీ మద్దతు దారులు భారీగా అక్కడికి వచ్చి నినాదాలు చేశారు. అంతే కాకుండా.. భారత్ పతాకంను చేతిలో పట్టుకుని అవమానంచేలా ప్రవర్తించారు. జైశంకర్ కూర్చున్న కారుపై దాడికి సైతం యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన లండన్ పోలీసులు ఖలీస్థానీ […]

గ్రామాల్లో పన్నులన్నీ ఇక ఆన్ లైన్లోనే..రేపు ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం ..!

ఏపీలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్ లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది. ఇందుకోసం స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ఆన్ లైన్ పోర్టల్ ను డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు. ప్రతీ పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చుపెట్టిన లావాదేవీల్ని కూడా ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.

మారుతున్న రాజకీయం.. ఆ పార్టీలోకి విజయసాయిరెడ్డి?

సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు.. వాటిని వదులుకోలేరు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత మళ్లీ పాలిటిక్స్ వైపే చూస్తారు. వైసీపీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోవడం, ఇటీవల పార్టీకి గుడ్‌పై చెప్పి.. రాజకీయాలకే గుడ్‌పై చెబుతున్నానని చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లపోతున్నారు అనే ప్రచారం పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యింది..

తెలంగాణ కేబినెట్ సమావేశం… బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ప‌లువురు అధికారులు హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల‌పై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యాక్షన్‌లోకి తహసీల్దార్లు

ఏ అంశమైనా వివాదాస్పదం అవ్వదేమో గానీ.. భూముల విషయాలు ఎప్పుడూ వివాదాస్పదం అవుతుంటాయి. చాలా భూముల్లో ఆక్రమణలు, కబ్జాలు ఉంటుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే.. ప్రక్షాళన జరగదు. అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫోకస్ పెట్టే పనిని జిల్లాల్లో తహసీల్దార్లకు అప్పగించింది. తమ చేతికి అస్త్రం రావడంతో తహసీల్దార్లు రెడీ అయ్యారు. ఇక వీళ్లు అన్ని భూముల రిజిస్ట్రేషన్లనూ పరిశీలించబోతున్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యబోతున్నారు. ఈ విషయంలో రాజీ ప్రసక్తే ఉండకూడదని రెవెన్యూ శాఖ చెప్పడంతో.. […]

ఇంధనం లేకుండానే అంతరిక్ష ప్రయాణం! . . . నూతన ‘శక్తి’ ఆవిష్కరణ?

నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్‌ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వారా ఇంధనం లేకపోయినా రాకెట్లకు కావాల్సిన థ్రస్ట్‌ను ఇది అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు నాసాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ చార్లెస్‌ బుహ్లెర్‌ తెలిపారు. నాసా చెప్పేది నిజమైతే  అంతరిక్ష ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. ఇంధనం లేకుండానే అంతరిక్ష మిషన్లను చేపట్టవచ్చు. అయితే, ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి […]

కేంద్రం కొర్రీ.. కూలీలు వర్రీ

ఉపాధిహామీ పథకం అమలుపై ఆది నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వం కొత్త  కొర్రీలు పెడుతూ నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నది. ఉపాధిహామీలో కొత్త పనులే చేపట్టాలని కేంద్రం నిర్దేశించడంతో పనిదినాల పూర్తిపై రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. పేదలకు ఉపాధినిచ్చి ఆర్థిక, ఆహార సాధికారిత కల్పించాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ పథకం అమలుపై మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు పనిదినాలు తగ్గించింది. వేతనాలివ్వడం, పెంపుపై అలక్ష్యం చేస్తున్నది. చేపట్టిన పనులే మళ్లీ చేస్తున్నారనే సాకుతో […]

ప్రపంచ కుబేరులకు డీప్‌సీక్‌ షాక్..

ప్రస్తుతం ప్రపంచ దేశాలు, టెక్‌ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పట్టు సాధించేందుకు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అయితే తక్కువ ఖర్చుతో చైనా నుంచి వచ్చిన డీప్‌సీక్‌, గ్లోబల్ టెక్‌ ఇండస్ట్రీకి షాక్‌ ఇచ్చింది. చైనాకు చెందిన ఏఐ కంపెనీ డీప్‌సీక్ భారీ సక్సెస్‌ అయింది. అమెరికా కంపెనీలకు సాధ్యం కాని ఫీట్‌ని ఇది సాధించడంతో టెక్‌ ఇండస్ట్రీ షాక్ అయింది. దీంతో ఏఐలో భారీగా పెట్టుబడులు పెట్టిన ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తులకు భారీ నష్టాలు […]

నితిశ్ కూటమి ఓటమి తప్పదు:ప్రశాంత్ కిశోర్

బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, జెడియూ కూటమి దారుణంగా ఓటమి పాలవుతుందని.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల లో ఓటమి తర్వాత.. బీజేపీని వీడి, మళ్లీ సీఎం అయ్యేందుకు మరో పార్టీతో జేడీయూ అధినేత నితిశ్ కుమార్ జతకడతారని అన్నారు. గతంలో జేడీయూ నుంచి బహిష్కరణకు గురై స్వయంగా జన సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత కిశోర్ చంపారణ్ జిల్లాలో ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON