loader

భారతదేశంపై సుంకాలు విధిస్తామన్న ట్రంప్.. ఏప్రిల్‌ 2 నుంచి అమలు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అతను సుంకాల విషయంలో భారతదేశం మరియు చైనాలను ఇరుకున పెట్టాడు. భారత్‌, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్‌ 2 నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా నుంచి ఎవరు సుంకాలు వసూలు చేసినా, వారి నుంచి సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు.

ఉత్తరాదిలో మూడో భాష ఏది?

దక్షిణాది రాష్ర్టాలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ త్రిభాషా విధానంపై తన వ్యతిరేకతను ఉధృతం చేశారు. ఉత్తరాది రాష్ర్టాలలో ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. హిందీని వ్యతిరేకిస్తున్న తనపై వస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ఉత్తరాదిలో మూడో భాషగా ఏ భాషను బోధిస్తున్నారో చెప్పాలంటూ విమర్శకులను ప్రశ్నించారు.

నాగబాబుకు మంత్రి పదవి లేనట్లే?.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం,

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు కేటాయించే పదవిపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయనకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు కష్టమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఇచ్చే పదవిపై చర్చ మొదలైంది. నాగబాబుకు కీలకమైన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కానీ.. రాజ్యసభకు పంపించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌తో అలా జరిగుండాల్సింది కాదు.. వైట్‌హౌస్‌ ఘటనపై జెలెన్‌స్కీ విచారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అప్పుడు అలా జరిగుండాల్సింది కాదని ఆయన వ్యాక్యానించారు. అంతేకాదు, ఉక్రెయిన్‌లో శాంతి నెలకునేందుకు ట్రంప్‌ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి తనతో పాటు తన బృందం సిద్ధంగా ఉందని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొద్ది గంటల్లోనే కీవ్ అధినేత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

స్పీకర్‌పై సుప్రీం అసహనం

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై మరోసారి సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకూ సమా ధా నం ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది.

కాళేశ్వరాన్ని కాదన్నానా.. బనకచర్లపై రాజకీయం ఎందుకు? చంద్రబాబు

బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఓ పార్టీ రాజకీయం చేస్తోందంటూ పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్న చంద్రబాబు.. గోదావరి నీళ్లు సముద్రం పాలు కాకుండా బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే బాధపడాల్సిన అవసరం ఏముందన్నారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లులాంటివన్న చంద్రబాబు.. తెలుగు ప్రజల ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.

రెవెన్యూ దందా..!

సంతనూతలపాడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయింది. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండుతోంది. ఎకరా భూమి ఆన్‌లైన్‌ చేయాలంటే రూ.40 వేల వరకు వసూలు. బాబూరావు అలియాస్‌ బోసుబాబు గత జనవరి  మార్చి 4వ తేదీ వరకు తన స్థలానికి పొజిషన్‌ ధ్రువీకరణ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరుచేయలేదు. విసిగిపోయిన అతను తహసీల్దార్‌ కారుకు అడ్డుగా నిరసన తెలిపారు. చివరకు పోలీసుల చేత అతనిని ఆందోళనను నిలిపివేయించారు.

పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త… సూసైట్ అటెంప్ట్ కేసులో

గాయని కల్పనా రాఘవేందర్ ఆత్మహత్యకు పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఆమె భర్త ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని ఆయనను ఇంటికి తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు.రెండు రోజులుగా తాను ఇంటిలో లేనని, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లినట్లు పోలీసులకు కల్పన భర్త ప్రభాకర్ తెలిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం అందుతోంది. చెన్నై ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం పని ఉంది? ప్రభాకర్ చెప్పిన సమాధానాలు నిజమా? కాదా? అనేది వెరిఫై చేయనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON