loader

రష్మికపై కన్నడిగుల కోపానికి కారణమేంటి?

బెంగళూరు లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి పలు వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ గనిగ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై పరుష పదజాలంతో విరుచుకుపడడం తో పాటు కొన్ని సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  బెంగళూరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి రష్మిక రావడానికి నిరాకరించిందన్నది అవాస్తవం. కర్ణాటక గురించి ఆమె అగౌరవంగా మాట్లాడిందన్నది కూడా పూర్తిగా అబద్ధం, అని రష్మిక మందన్న టీమ్ స్పందించినట్లు […]

SLBC టన్నెల్ ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు వచ్చింది..?

SLBC టన్నెల్ ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా.. అందులో చిక్కుకున్న 8 మంది బాధితుల ఆచూకీ మాత్రం లభించలేదు. శరవేగంగా సహాయక చర్యలు కొనసాగుతున్నా..టన్నెల్ లోపలి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించడం లేదు. భారీగా పేరుకుపోయిన బుదర, నీరు తొలగిస్తున్న కొద్ది మళ్లీ వచ్చి చేరుతోంది. దీంతో 2, 3 రోజుల్లో ఆపరేషన్ నిలిపేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

బేగంపేట విమానాశ్రయం నుంచి కమర్షియల్ విమానాలు

బేగంపేట విమానాశ్రయం నుంచి త్వరలోనే కమర్షియల్ విమానాల రాక పోకలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు డొమెస్టిక్ సేవలను కూడా ఇక్కడ పు నరుద్ధరిస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టుపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర విమానయాన సంస్థ భావిస్తున్నట్టుగా తెలిసింది.ప్రస్తుతం ఇక్కడి నుంచి విఐపి లు ప్రయాణించే విమానాలు, ప్రైవేటు ఫ్లైట్ల ల్యాండింగ్‌కు ఇక్క డ అనుమతి ఉంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ విమర్శలకు కౌంటర్‌

చాంపియన్స్‌ ట్రోఫీలో తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఒకే వేదికపై ఆడుతున్న భారత జట్టుకు ‘పిచ్‌ అడ్వాంటేజ్‌’ లభిస్తుందని వస్తున్న విమర్శలకు టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చాడు. దుబాయ్‌ తమ సొంత గ్రౌండ్‌ కాదని, ఇక్కడి పిచ్‌లు తమకూ కొత్త సవాళ్లను విసురుతున్నాయని తెలిపాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు నాసిర్‌ హుస్సేన్‌, అథర్టన్‌తో పాటు ఆసీస్‌ సారథి పాట్‌ కమిన్స్‌.. భారత్‌ అన్ని మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటం వారికి భారీ ప్రయోజనాన్ని చేకూర్చుతుందని […]

ఆన్‌లైన్‌ కంటెంట్‌ను క్రమబద్ధీకరించాలి

సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను క్రమబద్ధీకరించేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. అయితే, ఈ కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ ఉండకూడదని తెలిపింది. వాక్‌ స్వాతంత్య్రం హక్కుకు విఘాతం కలుగకూడదని స్పష్టం చేసింది. ఈ రంగంతో సంబంధం ఉన్నవారందరి సలహాలు, అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. పాడ్‌కాస్టర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చింది.

గోదావ‌రిలో వాటా తేల్చండి.. సీఎం రేవంత్ రెడ్డి

కృష్ణా న‌ది జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కేటాయించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కృష్ణా న‌ది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణ‌లో ఉంటే కేవ‌లం 30 శాతం మాత్ర‌మే ఏపీలో ఉన్నందున కృష్ణా జ‌లాల్లో 70 శాతం వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల‌ని, గోదావ‌రికి సంబంధించి తెలంగాణ వాటా నిక‌ర జ‌లాలు తేల్చిన త‌ర్వాతే ఏపీ ప్రాజెక్టుల‌పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి పాటిల్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON