ఆరో రోజు కొనసాగుతున్న టన్నెల్ రెస్క్యూ పనులు..
టన్నెల్ రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. SLBC టన్నెల్‌లో నీటి తోడకం చాలెంజింగ్‌గా మారింది. నిమిషానికి 5వేల లీటర్ల సీపేజ్ నీటి తోడకంతో పాటు బురద పేరుకుపోతుండడంతో రెస్క్యూ పనులు మరింత క్లిష్టంగా మారాయి. ఆర్మీ, నేవీ, NDRF, SDRF, GSI, సింగరేణి, ర్యాట్‌హోల్ మైనర్స్, BRO, L&T రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఆపరేషన్ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి ఉత్తమ్.. రెస్క్యూ చివరి దశకు చేరిందన్నారు. గల్లంతయిన వారిని క్షేమంగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.