loader

SLBC టన్నెల్‌లో చర్యలకు పలుచోట్ల ఆటంకం..

SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. టన్నెల్‌లో సీపేజ్‌ ఉబికి వస్తోంది. భారీ మోటార్లు ఉపయోగించి డీ వాటరింగ్‌ చేస్తున్నారు. ప్రమాద స్థలం దగ్గర గాలి లేదు, వెలుతురు అసలే లేదు. ఎయిర్‌ బ్లోయర్‌ ధ్వంసం అవడంతో.. పెద్ద స్థాయిలో గాలిని లోపలికి పంపించే పరిస్థితి కనిపించడంలేదు. టన్నెల్‌లో 12వ కిలోమీటర్‌ నుంచి 13వ కి.మి. వరకు అంతా గందరగోళ పరిస్థితులున్నాయి. కన్వేయర్‌ బెల్ట్‌ తెగిపోవడం.. మట్టి, నీరు, బురద,  సామాగ్రితో ఎలా పనులు […]

ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబుతో దగ్గుబాటి .. 30 ఏళ్ల తర్వాత అట

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుదీర్ఘకాలం తర్వాత కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దగ్గుబాటి తాను రాసిన ‘ఆది నుంచి నేటి వరకు’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం సుదీర్ఘ కాలం తర్వాత ఇదే తొలిసారి అంటున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత దగ్గుబాటి చంద్రబాబు ఇంటికి వెళ్లారని చెబుతున్నారు.

భారత్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. పాక్ ప్రధాని వింత వ్యాఖ్యలు

భారత్‌ విషయంలో పాక్ ప్రధాని సంచలన సవాల్ స్వీకరించారు. భారత్‌ను తాము ఓడిస్తామని.. ఒకవేళ ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని.. అతి విశ్వాసంతో కీలక వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏదో క్రికెట్ మ్యాచ్‌లో కాదు.. ఏకంగా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను పాక్ ఓడిస్తుందని.. తలపొగరు వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షెహబాజ్ షరీఫ్ పేరు మార్పు ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రతిపక్షహోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం.. వైసీపీ డిమాండ్‌పై పవన్ కల్యాణ్

విపక్ష హోదాపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు . జనసేన కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి విపక్ష హోదా దక్కేది అన్నారు పవన్‌ కల్యాణ్‌. ఈ టర్మ్ ముగిసేవరకు వైసీపీకి ప్రతిపక్షహోదా రాదని కరాఖండిగా చెప్పేశారు ఉప ముఖ్యమంత్రి. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని హితవు పలికారు పవన్ కల్యాణ్‌.

ఇంటర్నెట్‌ షట్‌డౌన్లలో భారత్‌ నెం.2

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్‌లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌ విధించారు. తాజా ర్యాంకింగ్స్‌లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌ రెండో స్థానంలో ఉన్నది. మణిపూర్‌ – 21, హర్యానా – 12, జమ్ము కశ్మీర్‌ – 12 2024లో 54 దేశాల్లో మొత్తం షట్‌ డౌన్లు – 296 2023లో 39 దేశాల్లో మొత్తం షట్‌ డౌన్లు – 283

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON