ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన.. పాక్‌కు షాక్!
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పాక్‌కు గట్టిషాకిచ్చింది. తనను బోనులో నిలబెట్టడం జీర్ణించుకోలేకపోయిన దాయాది దేశం ఎప్పటిలాగే విమర్శలు గుప్పించింది. శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే.