నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం.. శబరిమలకు పోటెత్తిన భక్తులు
మరికొన్ని గంటల్లోనే శబరిమలలో మకరజ్యోతి దర్శనం కనువిందు చేయనుంది. ఎన్నోరోజుల నుంచి ఎదురుచూసిన అద్భుత క్షణాలకు సమయం రానే వచ్చింది. ఇక ఈ మకరజ్యోతిని నేరుగా దర్శించుకునేందుకు శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. ఇక మకరజ్యోతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు, శబరిమల బోర్డు అన్ని పటిష్ఠ ఏర్పాట్లు నిర్వహించింది.