loader

రిప‌బ్లిక్‌డే పెరేడ్‌లో ఏపీ శ‌క‌టానికి పుర‌స్కారం

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని కర్తవ్యపత్‌లో జ‌రిగిన 76వ గ‌ణ‌తంత్ర దినోత్సవం పెరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన శ‌క‌టాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శ‌క‌టానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని చేతి వృత్తుల క‌ళా ప్రాముఖ్యత చాటుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార‌స‌త్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి,

మహాకుంభమేళాలో తొక్కిసలాట..30 మంది మృతి

మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారు జామున భక్తులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం, బుధవారం మధ్య రాత్రి 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మౌని అమావాస్య నాడు గంగానదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమం లోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయనేది భక్తుల విశ్వాసం.

జననాయకుడిగా దళపతి

తమిళ అగ్ర హీరో దళపతి విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దళపతి 69 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘జన నాయగన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కే నారాయణ నిర్మిస్తున్నారు.

టుడే టాప్ న్యూస్

1 | దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు. 2 | గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం. 3 | ఘనంగా గణతంత్ర వేడుకలు. 4 | రిపబ్లిక్ డే వేడుకలు: అమరవీరులకు మోదీ  పుష్పాంజలి. 5 | రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం… హాజరైన సిఎం రేవంత్‌రెడ్డి. 6 | రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నం :   ప్రకాశ్‌కారత్‌. 7 | రాజమండ్రిలో వెంకటేష్ సందడి.

ఓటు విలువ తెలుసుకో…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఓటనేది కుల, జాతి, మత, లింగ, భాషలకు అతీతంగా అందరికీ కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటుపట్ల చైతన్యం కలిగించడానికి భారతీయ ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తుంది.

ప్రేమ సౌధం తాజ్ మ‌హ‌ల్‌ను చూసేందుకు ఫ్రీ ఎంట్రీ..!

ప్రేమ సౌధం తాజ్ మ‌హ‌ల్‌ను వీక్షించాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌. వ‌రుస‌గా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి షాజ‌హాన్ 370వ ఉర్సు సంద‌ర్భంగా షాజ‌హాన్‌, ముంతాజ్ ఒరిజిన‌ల్ స‌మాధుల‌ను చూసేందుకు వీలుంటుంది. ఇత‌ర స‌మ‌యాల్లో సంద‌ర్శ‌కుల‌కు ఈ అవ‌కాశం ఉండ‌దు.

తెలంగాణలో బెన్‌ఫిట్ షోలు రద్దు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో సినిమాలకు ఇకపై ఎలాంటి బెన్ ఫిట్ షోలు చూసే వీలు లేదు. ఈమేరకు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టికెట్ ధరలు, స్పెషల్ షోలకు సంబంధించిన అనుమతులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కీలక నిర్ణయం వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫి చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని సూచించింది. ఆ చట్టం ప్రకారం.. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత.. ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ముందు ఎలాంటి షోలు అనుమతించొద్దని ఆదేశించింది.

UPSC 2025 సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ) 2025 నోటిఫికేషన్‌, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) ఎగ్జామినేషన్‌ 2025లను తాజాగా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 979 సివిల్ సర్వీసెస్‌ పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 150 ఐఎఫ్ఎస్‌ సర్వీస్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేశారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. […]

అమెరికా నూతన అధ్యక్షుడికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు. ” నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు […]

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే ఎలాన్ మస్క్‌ కు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విక్టరీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) అనే నినాదంతో పరిపాలనలో సంస్కరణలు తీసుకొస్తాం అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ కీలక ప్రకటన చేశారు. టెస్లా సీఈవో, ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. గవర్నమెంట్ ఎఫిషియెన్సీ అని కొత్త ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసి, […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON