loader

గూగుల్ మ్యాప్‌కు పోటీగా స్వదేశీ యాప్ అద్భుతమైన ఫీచర్లు, కేంద్రమంత్రి ట్వీట్ వైరల్..

గూగుల్ కి పోటీగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ మరో మేడిన్ ఇండియా యాప్ ను ప్రమోట్ చేశారు. ఇది గూగుల్‌ మ్యాప్‌ కంటే అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా ఆయన అన్నారు.Mappls Mapmyindia ఇది మన భారతీయ గూగుల్ మ్యాప్ అని చెప్పొచ్చు. ఇది 13 మంచి ఫీచర్లతో అద్భుతంగా ఈ యాప్ రోడ్లపై ఓవర్ బ్రిడ్జిలతో పాటు ఫ్లై ఓవర్లను కూడా ఈజీగా గుర్తిస్తుందని అన్నారు.  అపార్ట్‌మెంట్లో ఒక నిర్ధిష్టమైన షాప్ ని కూడా […]

బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2025.. ఉత్త‌మ చిత్రంగా ‘లాపతా లేడీస్’

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే 70వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2025 వేడుక గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.దర్శకురాలు కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ చిత్రం అత్యధిక అవార్డులను కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ‘చందు ఛాంపియన్’ చిత్రానికి కార్తీక్ ఆర్యన్, ‘ఐ వాంట్ టు టాక్’ చిత్రానికి అభిషేక్ బచ్చన్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందుకున్నారు.

తాలిబాన్లతో భీకర ఘర్షణ 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి..

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పాక్‌ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు అఫ్గాన్‌ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ వెల్లడించినట్లు పిటివి న్యూస్ పేర్కొంది

నా తలరాత ఏంటో నాకు తెలుసు.. సీఎం మార్పు వార్తలపై డీకే వ్యాఖ్యలు

ఈ ఏడాది చివరిలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చంటూ వచ్చిన పత్రికా కథనాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ శనివారం స్పందించారు. తనకు ఎటువంటి తొందర లేదని, తన తలరాత ఏమిటో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని లాల్‌ బాగ్‌ వద్ద ప్రజలతో ముచ్చటించేందుకు వచ్చిన డీకే పత్రికా కథనాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కొన్ని మీడియా చానెళ్లు వాస్తవాలను వక్రీకరించి సంచలనాత్మక కథనాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎంఐఎం సంచలన నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ’ఇండియా’ కూటమి నుంచి పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్ శనివారం వెల్లడించారు.

రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం

RJD కంచుకోటగా భావించే రఘోపూర్ నుంచి ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ ఓడిపోతారని జన్‌ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్టే తేజస్వీ కూడా రఘోపూర్ నుంచి ఓడిపాతారని అన్నారు. వైశాలి జిల్లాలోని వీవీఐపీ నియోజకవర్గమైన రఘోపూర్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి ప్రశాంత్ కిశోర్ శనివారంనాడు శ్రీకారం చుట్టారు. రఘోపూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు, రబ్రీదేవి మూడుసార్లు శాసససభ్యులుగా గతంలో ఎన్నికయ్యారు.

విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించిన తాజా నిర్ణయం దీనికి నిదర్శనం. విజయవాడ – సింగపూర్ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నవంబర్ 15 నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ సర్వీసులు వారానికి మూడు రోజులు – మంగళవారం, గురువారం, శనివారం -లభ్యమవుతాయని మంత్రి వివరించారు. ఈ మార్గంలో నడిచే విమానాలు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌లోని ప్రముఖ చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు నేరుగా చేరనున్నాయి.

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. ఆమెను “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు – 2025”కి ఎంపిక చేసినట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ప్రకటించింది. వ్యాపార రంగంలో ఆమె చూపిన సమర్ధనేతృత్వం, సామాజిక సేవల్లో చేసిన విశేష కృషి, మహిళా సాధికారత పట్ల చూపిన అంకితభావం కారణంగా ఈ అవార్డును అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON