loader

దీపావళి శుభాకాంక్షలు

ఈ పండుగ యొక్క విశేషమైన రోజున, మీ ఇంట్లో ఆనందాలు వెలువడుతూ, ప్రతి క్షణం కాంతితో నిండాలని మనసారా కోరుకుంటున్నాము, అందుకే ఈ దీపావళి మీరు ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము.

ఇది దీపాల పండుగ.. పటాసుల పండుగ కాదు : అర్వింద్‌ కేజ్రీవాల్‌

దీపావళి (Diwali) పండుగ అంటే దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ అని, పటాసులు కాల్చే పండుగ కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి (Delhi former CM) అర్వింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఈ పండుగ సందర్భంగా ఎవరూ పటాసులు కాల్చవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆయన చెప్పారు

మహారాష్ట్రలో ముగిసిన నామినేషన్ల పర్వం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. అయితే 15 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీల్లో ఇంకా స్పష్టత కొరవడింది. అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) వర్గంలో నాలుగు సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. ఇక విపక్ష మహా వికాస్‌ అఘాడీలోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌, ఎన్సీపీ (శరద్‌ పవార్‌) పార్టీలు 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

లైసెన్స్‌డ్‌ షాపుల్లోనే క్రాకర్స్‌ కొనండి

తెలంగాణ వ్యాప్తంగా దీపావళికి పటాకులు విక్రయించేందుకు 6,953 దరఖాస్తులు రాగా 6,104 దుకాణాలకు అనుమతి ఇచ్చినట్టు అగ్నిమాపకశాఖ ఏడీజీ నాగిరెడ్డి తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101కు, ఫైర్‌ కంట్రోల్‌ ఆఫీసు 9949 991101కు కాల్‌ చేయాలని కోరారు. హైదరాబాద్‌వాసు లు 8712699170, 8712699176కు, మేడ్చల్‌మలాజిగిరి 8712699165, 871 2699168కు, రంగారెడ్డివాసులు 87126 99160, 8712699163, 87126858 08కు కాల్‌ చేయాలని సూచించారు.

ఏఎన్నార్‌ జాతీయ పురస్కారం అందుకున్న చిరంజీవి

ANR National Award 2024-అన్నపూర్ణ స్టూడియోలో 2024కి గాను ఏఎన్నార్‌ జాతీయ పురస్కారాల వేడుకల కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ని శాలువాతో సత్కరించి.. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం చేశారు అమితాబ్‌ బచ్చన్‌.

దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి !

ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభం అవుతుందని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 31 గురువారం రాత్రి మొత్తం అమావాస్య వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆరోజున దీపావళి జరుపుకోవాలని తెలుపుతున్నారు.

ఓ సగటు మనిషి జీవితం లక్కీభాస్కర్‌ . . .

“లక్కీ భాస్కర్‌’ ఓ కొత్త ప్రయత్నం. వెంకీ రాసిన సన్నివేశాలు హృదయాలను తాకుతాయి. మీనాక్షి చౌదరి అద్భుతమైన పాత్ర చేసింది. తనతో నటించిన సన్నివేశాలు ఇంకా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఇదొక సగటు మనిషి జీవితం. అందరికీ నచ్చుతుంది’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు.

తమిళ స్టార్ విజయ్ పార్టీ తొలి సభ . . . లక్షలాది జనం . . .

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడులో విజయ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు.కొత్త రాజకీయ పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు, దళపతి విజయ్ తన శక్తివంతమైన ప్రసంగంతో ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ.. తాను పాలిటిక్స్ విషయంలో భయపడటం లేదు అని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్..

ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌లకు వివిధ శాఖల్లో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే మరో ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్‍‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వనట్లు తెలిసింది.

‘దానా‘ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. మరో 17 రైళ్లు రద్దు

ఒడిశా తీరప్రాంతంలో ‘దానా’ తుఫాన్‌ కారణంగా దక్షిణమధ్య రైల్వే పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేసింది. మంగళవారం 41 రైళ్లను రద్దు చేయగా.. తాజాగా మరో 17 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా రద్దయిన రైళ్లు గురువారం నుంచి ఈనెల 29 వరకు నిలిపివేస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON