loader

వెయ్యి కిలోమీటర్ల పరిధితో స్వదేశీ డ్రోన్ల తయారీ..

స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్ఏఎల్) శక్తివంతమైన స్వదేశీ (స్వదేశీ) కమికేజ్ డ్రోన్‌లను తయారు చేస్తున్నామని వెల్లడించింది. 1,000 కిలోమీటర్ల వరకు వెళ్లేలా స్వదేశీ-నిర్మిత ఇంజిన్‌లతో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. లోయిటరింగ్ ఆయుధాలు డూ-అండ్-డై యంత్రాల మోసుకెళ్లడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు గాజాలో ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో ఇలాంటి డ్రోన్లు విస్తృతంగా ఉపయోగించారు.

ఫోగట్‌కు నిరాశ.. ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కాప్‌

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) బుధవారం కొట్టివేసింది. రజత పతకం కోసం వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించినట్లు రెవ్‌స్పోర్ట్జ్ బుధవారం నివేదించింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రజత పతకం కోసం కాస్‌ను ఆశ్రయించిన ఫోగట్‌కు ఇటు భారతీయ క్రీడా అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది.

ఎర్రకోటపై త్రివర్ణ పతాక రెపరెపలు . . .

78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎర్రకోటపై జాతీయ‌జెండాను ఎగురవేసిన అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదే జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ముందుగా దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశం కోసం త‌మ జీవితాల‌నే ప‌ణంగా పెట్టిన మ‌హనీయులు ఎందరో ఉన్నార‌ని, ఈ సంద‌ర్భంగా వారి త్యాగాల‌ను స్మ‌రించుకుందామ‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. మ‌హనీయుల త్యాగాల‌కు ఈ దేశం రుణ‌ప‌డి ఉంద‌ని పేర్కొన్నారు.

2024లో ఆగని కొలువుల కోత : 1,30,000 మంది టెకీలపై వేటు

జాబ్‌ కట్స్‌ ట్రెండ్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఎప్పుడు తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది.ఐటీ పరిశ్రమ ఆర్ధిక సవాళ్లు కొనసాగడం, మార్జిన్ల ఒత్తిళ్లు, వ్యయ నియంత్రణ చర్యలతో టెక్‌ కంపెనీలు ఎడాపెడా కొలువుల కోతకు తెగబడుతున్నాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ 397 కంపెనీలు 1,30,482 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ డేటా వెల్లడించింది.

సౌత్ సినిమాలు అద్భుతం, బాలీవుడ్ బాద్ షా ప్రశంస!

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ దక్షిణాది దర్శకులు సినిమాలపై ఓ రేంజిలో పొగడ్తల వర్షం కురిపించారు. గత కొంతకాలంగా సౌత్ సినిమాలు అద్భుతంగా రూపొందుతున్నాయంటూ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్, సౌత్ సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. “భారతీయ సినిమాలను ప్రాంతాలుగా విడదీయడం సరికాదు. భారతదేశం విశాలమైన దేశం. దేశవ్యాప్తంగా పలు భాషలు ఉన్నాయి.  తెలుగు, మలయాళం, తమిళ సినిమా పరిశ్రమలలో దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్లు ఉన్నారు. ఇటీవల ‘జవాన్’, ‘RRR’, […]

ముగిసిన ఒలింపిక్స్… 71వ స్థానంలో భారత్

నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్‌ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్‌ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్‌.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది.తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయం – మోడీ

78 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఎర్రకోటపై జాతీయ‌జెండాను ఎగురవేసిన అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదే జాతినుద్దేశించి ప్ర‌సంగించారు. ముందుగా దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలిపారు.దేశం కోసం త‌మ జీవితాల‌నే ప‌ణంగా పెట్టిన మ‌హనీయులు ఎందరో ఉన్నార‌ని, ఈ సంద‌ర్భంగా వారి త్యాగాల‌ను స్మ‌రించుకుందామ‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. మ‌హనీయుల త్యాగాల‌కు ఈ దేశం రుణ‌ప‌డి ఉంద‌ని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 7569298753

EMAIL

admin@news4short.com

LOCATION

12-9-27/16
Prakashnagar,station road
beside Oxford School,
NARASARAOPET-522601-AP

DOWNLOAD APP

FOLLOW US ON