loader

ఆర్‌ఆర్‌ఆర్‌ పురోగతిపై రోజువారీ సమీక్ష

రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం మార్గానికి సంబంధించి భూసేకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, పనుల్లో జాప్యం లేకుండా ముందుకు సాగాలని అన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు.

సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!

ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ కు సినీ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన బర్త్ డే కు కొద్ది గంటల ముందు నుంచే విష్ చేయడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డేకు సంబంధించిన సీడీపీని మెగా హీరో వరుణ్ తేజ్ లాంఛ్ చేశారు. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు.

500 మంది ఫైటర్లతో.. పవన్‌ పై యుద్ద సన్నివేశం

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అనుకోని కారణాలతో కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగట్లేదు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైందని తెలిపారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు స్టంట్ డైరెక్టర్ సిల్వ. 400 నుంచి 500 మంది ఫైటర్లు, అలాగే వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నారు.

ఆక్రమణదారుల గుండెల్లో ‘హైడ్రా’ దడ . . .

వారం రోజులుగా హైడ్రా అధికారులు గండిపేట చెరువు సమీపంలోని ఖానాపూర్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో పర్యటించి.. దాదాపు పది అక్రమ నిర్మాణాలను గుర్తించారు. నిర్మాణదారులకు ముందస్తుగా నోటీసులు జారీ చేసినా.. వారి నుంచి నిర్దేశించిన సమయంలో ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆదివారం రెండు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మెడికల్‌ అడ్మిషన్లు, సౌకర్యాల పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్‌ఫోర్స్‌లో డీఎంఈ సభ్యకార్యదర్శిగా , డీఎంఈ(అకడమిక్‌), హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌, ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షించనున్నది.

ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడపనున్నారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు హస్తినకు వెళ్లారు. ఈరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులను చంద్రబాబు కలువనున్నారు. రాష్ట్ర పరిస్థితుల గురించి మరోసారి కేంద్రపెద్దల ముందు వివరించనున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రితో భేటీ అవుతారు సీఎం.

రుణమాఫీలో సీఎం విఫలం…

రెండు లక్షల రుణమాఫీ చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్వీ నాయకులు డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌ వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు.

రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగం…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. సామాజిక న్యాయమే మోదీ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని అధ్యక్షుడు ముర్ము అన్నారు.

వెయ్యి కిలోమీటర్ల పరిధితో స్వదేశీ డ్రోన్ల తయారీ..

స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (ఎన్ఏఎల్) శక్తివంతమైన స్వదేశీ (స్వదేశీ) కమికేజ్ డ్రోన్‌లను తయారు చేస్తున్నామని వెల్లడించింది. 1,000 కిలోమీటర్ల వరకు వెళ్లేలా స్వదేశీ-నిర్మిత ఇంజిన్‌లతో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. లోయిటరింగ్ ఆయుధాలు డూ-అండ్-డై యంత్రాల మోసుకెళ్లడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరియు గాజాలో ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో ఇలాంటి డ్రోన్లు విస్తృతంగా ఉపయోగించారు.

ఫోగట్‌కు నిరాశ.. ఫోగట్‌ అప్పీల్‌ను తిరస్కరించిన కాప్‌

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సిఎఎస్) బుధవారం కొట్టివేసింది. రజత పతకం కోసం వినేష్ ఫోగట్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించినట్లు రెవ్‌స్పోర్ట్జ్ బుధవారం నివేదించింది. 100 గ్రాముల అధిక బరువుతో ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. రజత పతకం కోసం కాస్‌ను ఆశ్రయించిన ఫోగట్‌కు ఇటు భారతీయ క్రీడా అభిమానులకు చివరకు నిరాశే మిగిలింది.

PHONE NUMBER

+91 7569298753

EMAIL

admin@news4short.com

LOCATION

12-9-27/16
Prakashnagar,station road
beside Oxford School,
NARASARAOPET-522601-AP

DOWNLOAD APP

FOLLOW US ON