
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విచ్చలవిడిగా దోపిడీలు, దౌర్జన్యాలు జరుగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శృతి మించిన 20 మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారని సమాచారం అందుతోంది.
రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినా వాళ్ల తీరులో మార్పు రాలేదని తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు సైతం ఆ నేతలు చెప్పినట్టు వినవద్దని చెప్పినట్టు సమాచారం.