
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు వెటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గౌరవప్రదంగా జరిగాయి. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అంత్యక్రియల్లో 130 విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 50 మంది దేశాధినేతలు, 10 మంది రాజులు ఉన్నారు. వీరితో పాటు 2.5 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ తన కోరిక మేరకు సాంప్రదాయ మూడు పేటికలకు బదులుగా చెక్క పేటికను ఉపయోగించారు. రోమ్‌లోని సాంతా మారియా మాగ్గియోరీ బాసిలికాలో సమాధి అయ్యారు.