కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. రూ.2,000 మసాలా బాండ్ కేసులో నోటీసులు జారీ చేసింది. సీఎంతోపాటూ ఆయన పర్సనల్ సెక్రటరీ, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు సోమవారం షోకాజ్ నోటీసులు పంపింది. 2019లో మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది. రూ.466 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఈ నోటీజులు జారీ చేసినట్లు తెలిసింది.

