
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతులకు 42 శా తం రిజర్వేషన్ల పెంపుదల కేంద్రంపై ఒత్తిడి పెం చేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఏప్రిల్ రెండో తేదీ బు ధవారం నాడు ఢిల్లీలో జరుగనున్న బిసి సంఘా ల మహాధర్నాకు మంత్రులు సంఘీభావం ప్రకటించనున్నారు. బిసి సంఘాల మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.