
నాగార్జున సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే జులై నెలలోనే 26 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం 18 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇక సాగర్ గేట్లు ఎత్తడంతో.. ఆ దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట 14 గేట్లను తెరిచారు. సాయంత్రం నాటికి మొత్తం 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.