అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కంపెనీ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమవడంతో అన్మోల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. యూనియన్ బ్యాంక్‌కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లిన వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ యూనియన్ బ్యాంక్ సహా మొత్తం 18 బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రూ.5,572 కోట్లకు పైగా రుణాలు తీసుకుంది.

