విశాఖపట్నం నుంచి వస్తున్న ఇండిగో విమానంలో ఇంజన్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో శనివారం పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్ తోపాటు, విమానాశ్రయ అధికారులు తక్షణమే అత్యవసర నిబంధనలను అమలు చేశారు. విమానాశ్రయంలోని 28వ రన్‌వేను వెంటనే మూసివేశారు. చివరికి ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

