
జెఫ్ బెజోస్ నేతృత్వంలోని ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ ఈ నెల 14న ఆరుగురు మహిళలను అంతరిక్ష పర్యాటకానికి పంపిస్తున్నది. ఈ ప్రయాణం 10 నిమిషాలపాటు ఉంటుంది. గ్లోబల్ పాప్ ఐకాన్ కేటీ పెర్రీ, నాసా మాజీ రాకెట్ సైంటిస్ట్ అయిషా బోవే, బయోయాస్ట్రోనాటిక్స్ రిసెర్చ్ సైంటిస్ట్ అమంద ఎన్‌గుయెన్, ప్రముఖ పాత్రికేయురాలు గేలీ కింగ్, ఫ్యాషన్, హ్యూమన్ రిసోర్సెస్, ఫిలిం నిర్మాత కెరియన్నే ఫ్లిన్, జెఫ్ బిజోస్ ప్రియురాలు, ఎమ్మీ అవార్డ్ విజేత లారెన్ శాంచెజ్ ఈ పర్యటనకు వెళ్తున్నారు.