
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఈ నెల 13న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్మానించనుంది. 82 యేళ్ళ ఇళయరాజా పలు భారతీయ భాషల్లో అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు హాజరుకానున్నారు. వీరితో పాటు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొనేలా ప్రభుత్వం ఆహ్వానాలు పంపనుంది.