కెసిఆర్ దీక్ష వల్లే తెలంగాణ వచ్చిందని బిఆర్ఎస్ చెప్పుకుంటుందని, కెసిఆర్ దీక్ష ఎలా చేశారో, ఎలాంటి ఫ్లూయిడ్స్ తీసుకున్నారో అందరికీ తెలుసనీ, 1,200 మంది అమరవీరుల త్యాగాల కంటే కెసిఆర్ దీక్ష పెద్దదా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ
అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. శనివారం సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్రెడ్డి, కిష్టయ్య వంటి ఉద్యమ వీరుల త్యాగాలను బిఆర్ఎస్ ఎందుకు గుర్తు చేసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.

