ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ(శుక్రవారం) శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం తెలపనున్నారు. వ్యవసాయ, గృహ నిర్మాణం శాఖకు సంబంధించిన పద్దులను మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారథి ప్రవేశపెట్టనున్నారు. పురపాలక శాఖ వార్షిక నివేదికను మంత్రి నారాయణ సభలో ప్రవేశ పెట్టనున్నారు.

