
ిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ తెలిపింది. ఒకేసారి ఏకంగా 11,908 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనోటిఫికేషన్ ద్వారా మెుత్తం 11,908 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS),హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 24లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభం అయిన నేపథ్యంలో అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ నుంచి దరఖాస్తు చేసుకోండి.