
పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం హతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కాడు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇకపై జాలి చూపను అంటూ.. తను చేసిన పాపాలన్నీ మరిచిపోయి భారత్ తప్పుచేసిందన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు మసూద్ ఉన్నాడా..? ఇంతకీ లేఖ విడుదల చేసింది ఎవరు అన్నదీ ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది.