గతేడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రమాదానికి గురైన విమానంలో కేవలం ఒక్కరోజులో తలెత్తిన లోపం వల్ల ప్రమాదం జరగలేదని గత 11 ఏళ్ల కాలంలో ఆ విమానంలో అనేక కీలక వ్యవస్థలు విఫలం అవుతూ వచ్చాయని పియర్సన్ తెలిపారు. విమానంలోని విద్యుత్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ నియంత్రణలలో తీవ్రమైన లోపాలు ఉన్నాయన్నారు. విమానానికి శక్తిని సరఫరా చేసే యూనిట్‌లో తరచూ అంతరాయాలు ఏర్పడ్డాయని
పేర్కొన్నారు. అలాగే పైలట్లకు దిశానిర్దేశం చేసే కంప్యూటర్ వ్యవస్థలో కూడా వైఫల్యాలను గుర్తించామన్నారు.

