
పెద్ద ఎత్తున యూట్యూబ్ చానల్స్‌పై గూగుల్ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 11వేల యూట్యూబ్ చానల్స్‌ను తొలగించినట్లు టెక్ కంపెనీ ప్రకటించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన చానల్స్ అత్యధికంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్ ఉన్నాయని తెలిపింది. అసత్య ప్రచారం, అపోహలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్ చేసినట్లు చెప్పింది. రష్యా చెందిన 2వేలకుపైగా యూట్యూబ్ చానల్స్‌పై వేటు వేసినట్లు పేర్కొంది.