ఆన్లైన్ ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు గొప్పగా చెప్పుకునే ’10 నిమిషాల డెలివరీ’ గడువుకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. గిగ్ వర్కర్ల ప్రాణాల భద్రత దృష్ట్యా ఈ నిబంధనను వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ సంస్థలను ఆదేశించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ప్రముఖ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

