
ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇసుకతో శిల్ప కళను ప్రదర్శించటంలో ఆయన చేసిన కృషికి గాను ‘ద ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్’ను అందుకున్నారు. ఇంగ్లండ్‌లోని వేమౌత్‌లో మొదలైన 2025 ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్లో సుదర్శన్ పట్నాయక్‌కు నగర మేయర్ జాన్ ఓరెల్ మెడల్, అవార్డును అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్ సైకత శిల్పి ఫ్రెడ్ డారింగ్టన్ పేరుమీదుగా బ్రిటన్ ఏటా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ కళాకారుడిగా సుదర్శన్ పట్నాయక్ రికార్డ్ సృష్టించారు.