కరూర్ తొక్కిసలాట దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ 4న సేలంలో భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్టీకి ఇచ్చిన లేఖలో మాత్రం భద్రతాసిబ్బంది లేకపోవడం, ఎంత మంది ప్రజలు హాజరవుతారనే కచ్చితమైన వివరాలు లేకపోవడం వంటి అంశాలను కారణాలుగా చూపారు. విజయ్ ప్రజా సమావేశాలకు నాలుగు వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

