హోర్ముజ్‌పై ఇరాన్ నియంత్రణ కొనసాగుతున్నప్పటికీ ఎనిమిది భారత నౌకలు ఈ జలసంధిని విజయవంతంగా దాటాయి. శనివారం ఉదయం ఎనిమిదవదైన ‘గ్రీన్ సాన్వి’ ఎల్‌పీజీ ట్యాంకర్ సైతం జలసంధిని దాటుకుని భారత్ దిశగా పయనిస్తోంది. మరో రెండు నౌకలు గ్రీన్ ఆశా, జగ్ విక్రమ్‌లు కూడా కొద్దిరోజుల్లోనే స్వదేశానికి రానున్నాయి. ఇప్పటి వరకు శివాలిక్, నందాదేవి, జగ్ లడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వి హోర్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి.

