33 ఏళ్లుగా ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యమని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. రైతుల సాధికారత, పారదర్శకత కోసం తమ సంస్థ పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం(ఎక్స్)లో నారా భువనేశ్వరి ట్వీట్ పెట్టారు. నాణ్యత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని అన్ని ఉత్పత్తులూ 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే.. మీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు.

