నగర ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు విసి సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు.

