తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల ముందు ఆటోలు క్యూ కట్టాయి. పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్‌లకు వాహనదారులు పోటెత్తారు. అత్తాపూర్, మల్లాపూర్, అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, ఘట్ కేసర్, జిహెచ్ఎంసి పరిధిలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల దగ్గర ఆటోలు భారీగా క్యూ కట్టాయి. పలు పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

