ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్ అండ్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఐడీబీఐ అందించిన ఆర్థిక నివేదికలు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చిన సాంకేతిక నివేదికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

