భారత ఏరోస్పేస్ రంగంలో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాణిజ్య, యుద్ధ విమానాల ఇంజిన్ల తయారీ సంస్థ సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) హైదరాబాద్‌లోని ఆదిభట్లలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రారంభోత్సవాన్ని మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అధికారులు, సాఫ్రాన్ ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

