
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరో అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే.. మిస్ వరల్డ్ పోటీలు ఈసారి హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రారంభ, ముగింపు వేడుకలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. భారత్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరిగి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ సుందరి అందాల పోటీలను 28 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తుండటం గమనార్హం.
- 0 Comments
- Hyderabad