
SAWiT (South Asian Women in Tech) ఓ భారీ Hackathon ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ హ్యాకథాన్‌లో 3,93,071 మంది పాల్గొన్నారు. ఫైనల్ రౌండ్ హైదరాబాద్‌లోని T-hubలో జరిగింది. ఈ ఈవెంట్ జనరేటివ్ AIలో ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా ఈవెంట్. దేశవ్యాప్తంగా ఫైనల్‌కు వచ్చిన 25టీమ్‌లులు వారి వారి స్థానిక భాషల్లోనే తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. మహిళలను వారి సొంత భాషలోనే టెక్ ప్రాజెక్టులను చేసేలా ప్రోత్సహించడం ద్వారా SAWiT సరైన ప్రాతిధ్యం దక్కని టాలెంట్ పూల్‌కు ప్రోత్సాహం అందించింది.