జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ సాబ్ నా స్నేహితుడు. ఇదే నా సలహా. మీరు హైదరాబాద్‌పైనే దృష్టి పెట్టండి. మీ బలమైన ప్రాంతమైన హైదరాబాద్‌ను రక్షించండి. అక్కడి ముస్లింల సంక్షేమం కోసం పనిచేయండి. బిహార్ సీమాంచల్లోకి వచ్చి రాజకీయ గందరగోళం సృష్టించడం అవసరం లేదు” అని అన్నారు. 2020లో ముస్లింలు చేసిన తప్పును ఈసారి సీమాంచల్ ప్రజలు పునరావృతం చేయరు” అని పేర్కొన్నారు.

