
ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ స్వదేశం చేరుకున్నాడు. పాకిస్థాన్‌పై ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన అతడు సోమవారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు. దాంతో.. ఈ స్టార్ క్రికెటర్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తిలక్‌ను చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. కారులో ఎక్కిన తర్వాత టీమిండియా స్టార్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.