
హైదరాబాద్ శివార్లలోని ఫిర్జాదిగూడ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా కబ్జాదారుల చెరలో చిక్కుకున్న రెండు ఎకరాల శ్మశానవాటిక భూమిని తిరిగి పొందడంతో స్థానికులు ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు. టెంట్లు వేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. టపాసులు పేల్చి తమ సంతోషాన్ని చాటుకున్నారు. సమస్య పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
- 0 Comments
- MedchalMalkajgiri District