
హైకోర్టులో జరిగిన లైవ్ స్ట్రీమ్ విచారణకు ఒక వ్యక్తి టాయిలెట్ నుంచి హాజరయ్యాడు. టాయిలెట్ సీటుపై కూర్చొన్న అతడు జూమ్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూన్ 20న గుజరాత్ హైకోర్టులో చెక్ బౌన్స్ కేసుపై విచారణ జరిగింది. ప్రతివాది అయిన వ్యక్తి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వర్చువల్‌గా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అయితే టాయిలెట్లో ఉన్న అతడు అక్కడి నుంచే ‘సమద్ బ్యాటరీ’ పేరుతో జూమ్ లైవ్ స్ట్రీమ్‌లో కనిపించాడు.