
ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పుతుండగా.. అక్కడ నోట్ల కట్టలు లభ్యమైనట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీని గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమాచారం తెలియడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. న్యాయవ్యవస్థ పారదర్శకంగా ఉండాలని కోరుకుంటోన్న సీజేఐ.. కొలీజియంలోని న్యాయమూర్తులతో సంప్రదించిన అనంతరం నివేదికను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు విశ్వనీయ వర్గాలు పేర్కొన్నాయి. నివేదికలో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతోపాటు ఢిల్లీ పోలీసు కమిషనరు అందించిన వివరాలు, ఫొటోలు, వీడియోలను పొందుపరిచారు