
ఓజీ సినిమా టికెట్ రేట్లుపెంపుని సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన పిటీషనర్‌ను హేళన చేస్తూ పోస్ట్ పెట్టింది డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.ఇది పిటిషనర్ బార్లా మల్లేష్ యాదవ్‌కు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మేము అతనికి ఏదైనా నిజాం థియేటర్‌లో టికెట్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నాము. మల్లేష్ గారూ.. మా అభిమానులు ఆస్వాదించినట్లే మీరు ఓజీ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ లవ్ సింబల్ ❤️ ఎమోజీని షేర్ చేశారు.