
హెచ్-1బీ వీసా ఫీజు పెంపు ప్రకటన ఎన్నారైలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిబంధనల్లో అస్పష్టత, వెంటనే అమెరికాకు తిరిగి రావాలంటూ ఎన్నారైలకు టెక్ కంపెనీల పిలుపు కారణంగా భారతీయులు అనేక మంది నానా రకాల ఇబ్బందులు పడ్డారు. సెలవులకు ఇండియాకు వచ్చిన భారతీయులు సహా వివిధ దేశాల్లోని ఎన్నారైలు అమెరికాకు క్యూకట్టారు. 4Chan ఆన్‌లైన్ ఫోరమ్ యూజర్లు కొందరు విమాన టికెట్లను బ్లాక్ చేసి భారతీయులకు టిక్కెట్ల దొరకకుండా చేశారని తెలుస్తోంది. టిక్కెట్లు కొంటామంటూ వాటిని రిజర్వ్‌లో పెట్టి ఆ తరువాత కొనకుండా వదిలేశారట.