
అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్‌ను వదిలివెళ్తామని సన్‌రైజర్స్ విడుదల చేసిన ఈ-మెయిల్ తీవ్ర దుమారం రేపుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఎలాంటి ఈ-మెయిల్ రాలేదని హెచ్‌సీఏ స్పందించింది స్టేడియం దక్షిణ భాగంలోని మొదటి అంతస్తులో గల ఎఫ్-12ఏ బాక్సులో కాంప్లిమెంటరీ పాసుల దగ్గరే ఇరువర్గాలు ఏకాభిప్రాయం కుదరడం లేదని వినికిడి.