
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్ల కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రిజిస్ట్రార్ హెచ్‌సియు భూములకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ను కలిసి వర్సిటీలో ధ్వంసమైన భూమిని చూపించారు. అన్ని వరాలు సేకరించి విశ్లేషించి హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించారు.
- 0 Comments
- Hyderabad
- RangaReddy District