
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత నెలకొంది. విశ్వ విద్యాలయంలోని భూముల విక్రయించేందుకు ప్రభుత్వం యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల్లో చెట్లను కొట్టివేస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు యూనివర్సిటీ మెయిన్ గేట్‌కు తాళం వేసి, జెసిబిలతో చెట్లను కూల్చివేసి చదును చేశారు.